20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

by Muthe.Rajitha |

ఏపీలో స్క్రబ్ టైఫస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో స్క్రబ్ టైఫస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో అంతకంతకూ కేసులు పెరగడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా పెదపులుగువారిపాలెంలో నాగబాబు అనే యువకుడు స్క్రబ్ టైఫస్ తో మరణించడం కలకలం రేపింది. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతన్ని గుంటూరు ప్రభుత్వ్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ గా తేల్చారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 20 కి చేరింది. అయితే తాజా మరణాలకు స్క్రబ్ టైఫస్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు (కో-మార్బిడిటీస్) కూడా కారణమై ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఖచ్చితమైన కారణాలు నిర్ధారించేందుకు ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్‌ చేపడుతోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఆసుపత్రుల్లో డాక్సీసైక్లిన్‌, అజిథ్రోమైసిన్‌ మందులను అందుబాటులో ఉంచారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, స్క్రబ్ టైఫస్ చిగ్గర్ మైట్స్ కాటు ద్వారా వ్యాపిస్తుండటంతో పొలాలు, పచ్చిక బయళ్లలో పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది.

Next Story