ఈ పురుగు కుడితే జ్వరం, వణుకుతో ముసుగేయాల్సిందే.. ఏపీలో పెరుగుతున్న కేసులు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో కొత్తరకం జ్వరాల కేసులు పెరుగుతున్నాయి.

ఈ పురుగు కుడితే జ్వరం, వణుకుతో ముసుగేయాల్సిందే.. ఏపీలో పెరుగుతున్న కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్తరకం జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడం వల్ల తీవ్రమైన జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పటికే 26 జిల్లాల్లోనూ ఈ రకమైన కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్ నల్లి మాదిరిగా కనిపించే చిన్న పురుగు. రికెట్సియా కుటుంబానికి చెందిన ఒరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా కారణంగా ఇది వస్తుంది. ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే.. తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు (ARDS), మెదడు, వెన్నెముక ఇన్ఫెక్షన్లు (మెనింజైటిస్), మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా మరణించే అవకాశాలు లేదా రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉన్నట్లు చెప్తున్నారు.

రాష్ట్రంలోని చిత్తూరులో 379 మందికి స్క్రబ్ టైఫస్ ను గురించారు. అలాగే కాకినాడ జిల్లాలో 141, విశాఖపట్నం 123, కడప 94, నెల్లూరు 86, అనంతపురం 68, తిరుపతి 64, విజయనగరం 59, కర్నూల్ 42, అనకాపల్లి 41, శ్రీకాకుళం 34, అన్నమయ్య 32, గుంటూరు 31, నంద్యాల 30 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నార్మల్ యాంటీ బయాటిక్స్ తో నయమయ్యే ఛాన్స్ ఉన్నా.. దానిపై సరైన అవగాహన లేకపోవడంతో సమస్య పెరుగుతోంది. జ్వరం తగ్గకపోతే టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు కానీ.. ఈ రకమైన ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని గుర్తించలేకపోతున్నారు. శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఎలిసా పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసే వారు కాళ్లకు బూట్లు వేసుకోవాలని తెలిపారు.

Next Story