చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. విద్యార్థులకు గాయాలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-15 13:37:36  IST  )

శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో స్కూల్ బస్సు(School Bus) చెరువులోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.

చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. విద్యార్థులకు గాయాలు
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో స్కూల్ బస్సు(School Bus) చెరువులోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఇవాళ(శనివారం) సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ఓ పాఠశాల బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద స్కూల్ బస్సు(Vivekananda School Bus) మందసం మండలం ఉమా గిరి వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బస్సులోని విద్యార్థుల(Students)ను ఒడ్డుకు చేర్చారు. ఐదుగురు విద్యార్థులకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం మందస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పిందని, స్వల్ప గాయాలతో బయటపడ్డారని అక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story