డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ.. స్కూల్ బస్సుకు నిప్పు

by Ajay Maddhiboyina |

ప్ర‌కాశం జిల్లా అర్థ‌వీడు మండ‌లం పాపినేనిప‌ల్లిలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. డ్రైవ‌ర్ క్లీనర్ మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌తో స్కూల్ బ‌స్సును త‌గ‌ల‌బెట్టారు. పిల్ల‌ల‌ను స్కులుకు తీసుకువెళ్లేందుకు వెళుతున్న క్ర‌మంలో ఆల్ఫా హై స్కూల్ బ‌స్సు డ్రైవ‌ర్, క్లీన‌ర్ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.

డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ.. స్కూల్ బస్సుకు నిప్పు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌కాశం జిల్లా అర్థ‌వీడు మండ‌లం పాపినేనిప‌ల్లిలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. డ్రైవ‌ర్ క్లీనర్ మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌తో స్కూల్ బ‌స్సును త‌గ‌ల‌బెట్టారు. పిల్ల‌ల‌ను స్కులుకు తీసుకువెళ్లేందుకు వెళుతున్న క్ర‌మంలో ఆల్ఫా హై స్కూల్ బ‌స్సు డ్రైవ‌ర్, క్లీన‌ర్ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. అది కాస్తా పెద్ద‌ది కావ‌డంతో ఒక‌రిపై మ‌రొక‌రు దాడి చేసుకునేవర‌కు వెళ్లింది. ఈ క్ర‌మంలో క్లీన‌ర్ త‌న వ‌ద్ద ఉన్న పెట్రోల్ తీసి బ‌స్సుపై పోసి త‌గ‌ల‌బెట్టాడు. దీంతో బ‌స్సు పూర్తిగా కాలిపోయింది. బ‌స్సులో ఉన్న డ్రైవ‌ర్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. డ్రైవ‌ర్ ను స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన సమ‌యంలో బ‌స్సులో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది.

Next Story