పరకామణిలో చోరీ చిన్నదేనని అనడం అవమానించడమే : నిమ్మల రామానాయుడు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-08 12:02:23  IST  )

పరకామణి చోరీ (Parakamani Chori) చిన్నదేనని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అనడం అవమానించడమేనని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) అన్నారు.

పరకామణిలో చోరీ చిన్నదేనని అనడం అవమానించడమే : నిమ్మల రామానాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : పరకామణి చోరీ (Parakamani Chori) చిన్నదేనని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అనడం అవమానించడమేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) అన్నారు. చిన్నపాటి చోరీకి శిక్ష వేస్తారా అని జగన్ ప్రశ్నించడంపై అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దమ్మయ్యపర్తి మురుగు కాలువపై నూతనంగా నిర్మిస్తున్న గోడ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడూతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిన్నపాటి చోరీకి శిక్ష వేస్తారా? అని జగన్ ప్రశ్నించడం భక్తులను, టీటీడీనీ అవమానించడమే అని మండిపడ్డారు. దొంగతనం అనేది చిన్నదైనా, పెద్దదైనా నేరమేనని, అదీ కలియుగ దైవం శ్రీవారి హుండీ కానుకలను దొంగిలించడం మహాఘోరమని ఆయన అన్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని వెనకేసుకురావడమే కాకుండా, దాతగా చిత్రీకరించే ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి చేయడంలో ఆంతర్యం ఏమిటని మంత్రి నిమ్మల ప్రశ్నించారు.

​కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరకామణిలో జరిగిన ఈ చోరీ కేసులో నిందితుడు రవికుమార్ నుంచి సుమారు రూ. 14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా రాయించుకుని లోక్‌ అదాలత్‌లో కేసును రాజీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ విచారణ జరిపింది. కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఈ కేసు తీవ్రతను మరింత పెంచింది. శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఈ సంఘటనను మాజీ సీఎం సమర్థించడం.. అక్రమాలకు, అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసు రాజీపై ప్రస్తుత టీటీడీ బోర్డు కూడా కొత్త క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్ణయించింది.

Next Story