- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌదీ ప్రమాదం | సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం
సౌదీలో జరిగిన రోడ్డు (Saudi Road Accident) ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సౌదీలో జరిగిన రోడ్డు (Saudi Road Accident) ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు. మక్కా యాత్రకు వెళ్లిన పలువురు తెలంగాణ వాసులు ఈ ఘటనలో మృతి చెందారన్న వార్త తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు. పవిత్ర ఉమ్రా యాత్రలో ఇటువంటి దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించి వారికి మానసిక ధైర్యం లభించాలని కోరుకున్నారు.
భారతీయులు దుర్మరణం చెందడం బాధాకరం
సౌదీ అరేబియా దేశంలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు దుర్మరణం చెందడం బాధాకరం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మృతి చెందిన వారిలో అత్యధిక మంది హైదరాబాద్ కు చెందిన ముస్లిం యాత్రికులు ఉన్నట్లు తెలిసిందన్నారు. వారి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.






