- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవు: మంత్రి అనగాని
9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవని మంత్రి అనగాని సత్యప్రసాద్(Satya Prasad, the minister) తెలిపారు. 17 జిల్లాల్లో మార్పులు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని ఆయన పేర్కొన్నారు. కేబినెట్(Cabinet)లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), సత్యకుమార్ యాదవ్(Satyakumar Yadav) వివరించారు. మంత్రి అనగాని మాట్లాడుతూప్రజల కోరిక మేరకే డివిజన్లు, మండలాలు మార్పు చేసినట్లు తెలిపారు. పోలవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నెల్లూరు జిల్లాలోకి మళ్లీ గూడూరును తీసుకొచ్చామన్నారు. మండపేటను రాజమండ్రిలోకి, వాసవి పెనుగొండగా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. ప్రకాశంలో అద్దంకి, దర్శి ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి తీసుకురావడం జరిగిందన్నారు. రాజంపేటను కడపలోకి, రాయచోటిను తొలగించి మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొన్ని సబ్ డివిజన్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 1 నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.






