- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిడ్నాప్
శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిడ్నాప్‌నకు గురయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిడ్నాప్‌నకు గురయ్యారు. రూ. వందల కోట్ల విలువైన ఆస్తులున్న ఈ కాలేజీ ప్రాంతంపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ వంకాలపాడు శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. బందర్ రోడ్డు డీ అడ్రస్ మాల్ వద్ద శ్రీనివాస్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో విజయవాడ సీపీకి డీ అడ్రస్ మాల్ యజమాని శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కృష్ణలంక పోలీసులకు సీపీ సమాచారం అందించారు. వెంటనే స్థానిక సీసీ పుటేజ్‌ను పరిశీలించారు. శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసిన దృశ్యాలు రికార్డు అయ్యారు. అటు కుటుంబ సభ్యులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ గాంధీనగర్‌కు చెందిన వ్యక్తి కావడంతో కృష్ణలంక నుంచి సత్యనారాయణ పురం పోలీసులకు కేసును బదిలీ చేయనున్నారు.






