సంక్రాంతి ఎఫెక్ట్.. తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-11 04:08:29  IST  )

సంక్రాంతికి అందరూ సొంతూరికి పయనమవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.

సంక్రాంతి ఎఫెక్ట్.. తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి?
X

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతికి అందరూ సొంతూరికి పయనమవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సాధారణంగా వీకెండ్ లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమలలో కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా.. వెలుపల క్యూలైన్లలో వేచి ఉంటారు. కానీ.. సంక్రాంతి సీజన్ లో భక్తుల రాక తగ్గింది. ఆదివారం ఉదయానికి స్వామివారి దర్శనార్థం 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా కొత్తగా భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇప్పటికే క్యూలైన్లలో ఉన్న భక్తులకు 5 గంటల్లో స్వామివారి దర్శనం అవుతుందని పేర్కొంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3-5 గంటల్లో దర్శనం అవుతుందని పేర్కొంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (శనివారం) శ్రీ వేంకటేశ్వరస్వామివారిని 76,820 మంది భక్తులు దర్శించుకోగా.. 24,368 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Next Story