‘సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ’ ఆత్రేయపురంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు

by Ramesh Naini |

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

‘సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ’ ఆత్రేయపురంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ‘సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ’ పేరిట నిర్వహించిన డ్రాగన్ పడవ పోటీలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. అలాగే గాలిపటాలు ఎగురవేసే పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీలను రాష్ట్ర మంత్రులు అనిత, దుర్గేశ్ ప్రారంభించారు. కేరళ, పశ్చిమ గోదావరి, పల్నాడు, కోనసీమ, కొత్తపేట, కర్నూలు జట్ల మధ్య సెమీ ఫైనల్స్‌ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. పోటీ స్థలంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రులు సందర్శించి నిర్వాహకులను అభినందించారు.

పోటీల్లో మొత్తం 22 జట్లు..

కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి మొత్తం 22 జట్లు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాయి. గోదావరి తీరంలో సాగిన ఈ పోటీలు చూడటానికి వందల మంది ప్రజలు తరలివచ్చారు. రంగురంగుల గాలిపటాలు, పడవల వేగం, సంబరాల కోలాహలం కలిసి సంక్రాంతి వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి.

Next Story