- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Talliki vandanam: తల్లికి వందనం.. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి.. మే నెలలోనే
ఈ ఏడాది మేనెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది మేనెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (nara lokesh) స్పష్టం చేశారు. శాసనసభలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ (guide lines) త్వరలో ఇస్తాం. బడ్జెట్ లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం అన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. బడ్జెట్ లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. గత ప్రభుత్వంలో వారు సంవత్సరానికి 5,540 కోట్లు కేటాయించారు, గతంతో పోలిస్తే ఇది 50శాతం అధికం అన్నారు. ఎన్నికలకు ముందుకు సూపర్ – 6 (super six) అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని ఆనాడు చంద్రబాబు (chandrababu) ప్రకటించారని తెలిపారు.
చట్టసభలు చూస్తూ పెరిగినవాడ్ని, చిన్నవయసులో చట్టసభలను చూశాను, అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు, ప్రజలకు ఏమి కావాలో దానిపైనే చర్చలు జరిగేవని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీకి (ycp) ప్రతిపక్ష హోదా అంశంలో సాక్షి తప్పుడు రాతలపై మంత్రి లోకేష్ స్పందిస్తూ ఇటీవల ప్రతిపక్ష సభ్యులు బాధ్యత చేయకుండా గవర్నర్ (governor) స్పీచ్ ను డిస్ట్రబ్ చేసి వెళ్లారని అన్నారు. గతంలో మేం నిరసన తెలియజేసినపుడు బెంచిలవద్దే ఉండి ధర్నా చేశాం, పోడియం వద్దకు రాలేదన్నారు. మేం ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదు. నేను అసెంబ్లీలో కొత్త మెంబర్ ని. పార్లమెంటులోని 121సి నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెం.లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉందన్నారు. స్పీకర్ పై ( assembly speaker)వ్యక్తిగత ఆరోపణలు చేయడం హౌస్ పరువు తగ్గిస్తుందన్నారు. సాక్షి పత్రికలో తప్పుడు రాతలు బాధాకరం. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదు. చట్టాన్ని ఉల్లంఘించడం, దానిని హౌస్ పైన రుద్దడం బాధాకారం అన్నారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి లోకేష్ చెప్పారు.






