సాలూరు లైంగిక వేధింపుల కేసు.. పోలీసులపై మహిళ సంచలన ఆరోపణలు

by Ajay Maddhiboyina |

మంత్రి సంధ్యారాణి కుమారుడు, ఆమె పీఏ లైంగిక వేధింపులకు పాల్పడతున్నారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. విజయనగరంలో మెడికల్ టెస్టుల కోసం బాధితురాలు వెళ్లగా అనంతరం

సాలూరు లైంగిక వేధింపుల కేసు.. పోలీసులపై మహిళ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి సంధ్యారాణి కుమారుడు, ఆమె పీఏ లైంగిక వేధింపులకు పాల్పడతున్నారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. విజయనగరంలో మెడికల్ టెస్టుల కోసం బాధితురాలు వెళ్లగా అనంతరం మీడియాతో మాట్లాడింది. మంత్రికి అనుకూలంగా పోలీసులు విచారణ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించింది. శుక్రవారం మధ్యాహ్నం మెడికల్ టెస్టులకు పిలిచి శనివారం సాయంత్రం వరకు పోలీసుల అధీనంలోనే ఉంచారని చెప్పింది.

తన పిల్లలతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోన్ తో సహా ఇంట్లో 3 ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పింది. తనను వేధించిన మంత్రి పీఏ సతీష్‌ని విచారణకే పిలవలేదని ఆరోపించింది. మంత్రి పీఏ హ్యాపీగా తిరుగుతున్నాడని, ఈ కేసుతో సంబంధం లేని పిల్లలను కూడా ఇబ్బందిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. ఇదిలా ఉంటే ఈ కేసులో పీఏ సతీష్ పై బీఎన్ఎస్ 64(1), 74, 79, 318(4), 329(3), 115(2), 324(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద సతీష్ పై కేసులు నమోదు చేశారు.

Next Story