- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం: రైతుల దీనస్థితిపై శైలజానాథ్ ఆవేదన
మాటల్లో కానీ చేతల్లో కాదని, చెప్పేవి కొండంత చేసేవి గోరంత అని, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు..

దిశ, వెబ్ డెస్క్: మాటల్లో కానీ చేతల్లో కాదని, చెప్పేవి కొండంత చేసేవి గోరంత అని, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సాకే శైలజనాథ్(Former Minister and YSRCP leader Dr. Sakye Sailajanath) విమర్శించారు. అనంతపురం జిల్లా(Ananthapur District) గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల పుట్లూరు మండలాల్లో నష్టపోయిన పంటలను ఉద్దేశించి శైలజానాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో పురుషోత్తం రెడ్డి 5000 అరటి మొక్కలు నాటితే దాదాపు 2000 లకు పైగా అరటి మొక్కలు నేలకొరిగాయన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించడంతోపాటు తడిసిన పంటలను కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క శింగనమల నియోజకవర్గం లోనే దాదాపు 160 ఎకరాల పైబడి మొక్కజొన్న పంట, అలాగే 90 ఎకరాల వరకు అరటిపంట అకాల వర్షాలకు దెబ్బతిందని, రైతులను ఆదుకోవాలని శైలజానాథ్ తెలిపారు.
తక్కువ రేటుకు అమ్ముకోలేక..
‘‘మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధరలు లేక దళారులకు తక్కువ రేటుకు అమ్ముకోలేక రైతన్నలు పండించిన పంటను తమ ఇళ్ల దగ్గరే నిలువ చేసుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 అయితే కనీసం రూ.1600 రూపాయలకు మించి పంటని కొనని పరిస్థితులను చూస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రభుత్వ పెద్దలారా మీరు నిద్ర మేలుకోండి . రైతులు నిల్వ ఉంచుకున్న మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా తక్షణమే చర్యలు తీసుకోండి. అలాగే అకాల వర్షాల వలన దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంతోపాటు ఆ పంటలను కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాలని కోరుతున్నాం. పంటను బట్టి ఎకరాకు కనీసం రూ.30 నుంచి రూ.40 వేలు తక్షణ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలి. అలా జరగని పక్షంలో రైతుల పక్షాన చేసే పోరాటంలో వైసీపీ ముందుంటుంది.’’ అని సాకే శైలజానాథ్ హెచ్చరించారు.






