AP News : సజ్జలను రాష్ట్ర బహిష్కరణ చేయాలి : ఎమ్మెల్యే కోటంరెడ్డి డిమాండ్

by Muthe.Rajitha |

అమరావతి(Amaravati) మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని(Expulsion) టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(MLA Kotamreddy Sridhar Reddy) డిమాండ్ చేశారు.

AP News : సజ్జలను రాష్ట్ర బహిష్కరణ చేయాలి : ఎమ్మెల్యే కోటంరెడ్డి డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి(Amaravati) మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని(Expulsion) టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(MLA Kotamreddy Sridhar Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా వేదిక X లో ఓ పోస్టు పెట్టారు. "రాజకీయ పీపీలికం సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి. ఆయనను తక్షణమే రాష్ట్ర బహిష్కరణ చేయాలి. అది రాష్ట్రానికి మంచిది. సజ్జల.. నువు జగన్ బంట్రోతువి. నీకు రాజకీయాలు, ప్రజలతో సంబంధం లేదు. రాజకీయ విమర్శలు చేసే అర్హత లేదు.

ఎన్నికల్లో మీ పార్టీకి 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా మీ తీరు మారలేదు." అంటూ మండిపడ్డారు. కాగా నిన్న విజయవాడ సాక్షి ఆఫీసు ముందు ధర్నాకు దిగిన మహిళలను సజ్జల.. సంకర తెగ, పిశాచాలు అంటూ పరుష పదజాలంతో దూషించారు.

Next Story