- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెయ్యి కల్తీ ఎన్డీడీబీ రిపోర్టు బయటపెట్టాలి: సాధు పరిషత్ డిమాండ్
శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై తప్పు ప్రచారం జరుగుతోందని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు...

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి లడ్డూ నెయ్యి(Srivari Laddu Ghee) కల్తీ వ్యవహారంపై తప్పు ప్రచారం జరుగుతోందని, అలా చేస్తే భక్తులు క్షమించరని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి(Sadhu Parishad President Srinivasananda Saraswati) హెచ్చరించారు. లడ్డూ అంశంపై కూటమి, వైసీపీ(Ycp) నేతలు చేస్తున్న పరస్పర ఆరోపణలపై విశాఖలో ఆయన స్పందించారు. శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించి సిట్ వద్ద నివేదికలు ఉన్నాయని, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము టీటీడీ(TTD) ఈవోకి లేఖ రాశామని చెప్పారు. లడ్డూలో రసాయనాలు కలిశాయని తేలిందని, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీటీడీ మాజీ చైర్మన్లను తెలియకుండా ఈ వ్యవహారం నడిచిందా అని నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, అంతకుముందు నాణ్యత చాలా బాగుండేదని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు.






