పోలీసుల దర్యాప్తు మొదలు.. ఎవరూ తప్పించుకోలేరని అధికార పార్టీ ట్వీట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-04 14:03:14  IST  )

అమరావతి(Amaravati) రాజధాని పున:నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

పోలీసుల దర్యాప్తు మొదలు.. ఎవరూ తప్పించుకోలేరని అధికార పార్టీ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి(Amaravati) రాజధాని పున:నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అత్యంత గ్రాండ్‌గా పనులు పున:ప్రారంభమైన రెండో రోజే ఈ ఘటన జరగటం కలకలం రేపుతోంది. అయితే ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. గత టీడీపీ హయాంలో 2018, డిసెంబరు 27న సీఎం చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేశారు. అప్పటి ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల పేర్లను ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం బోర్డులో రాయించారు. కొందరు కావాలనే ఈ ధ్వంసానికి పాల్పడ్డారని తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఈ శిలాఫలాల ధ్వంసం ఘటనపై అధికార తెలుగు దేశం పార్టీ స్పందించింది. ఈ మేరకు పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో దీనిపై పోస్టు పెట్టింది. ‘‘రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడింది అని ప్రధాని చెప్పారు. గ్రహణం వీడింది కానీ, ఆ సైకో భూతం మాత్రం ఇంకా పట్టుకుని వేలాడుతూనే సైకో చేష్టలు చేస్తోంది. అమరావతి మళ్ళీ మొదలు కాబోతుందని 5 కోట్ల ప్రజలు సంతోషంలో ఉంటే, సైకోలు మాత్రం విధ్వంసాన్నే కొనసాగిస్తూ, అమరావతి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దీని వెనుక ఏ గ్రహణం ఉన్నా ఈ ప్రభుత్వం వదలదు’’ హెచ్చరిస్తూ పోస్టు పెట్టింది.

Click For Tweet..

Next Story