ఆ నెంబర్ కూడా 11.. జగన్‌పై అసెంబ్లీలో సెటైర్లు

by Vemula.Srinu Prasad |

పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన నెంబర్ టోటల్ 11 రావడంపై జగన్‌పై అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు సెటైర్లు వేశారు.....

ఆ నెంబర్ కూడా 11.. జగన్‌పై అసెంబ్లీలో సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైసీపీ డిజిటల్ బుక్‌ యాప్‌(YCP Digital Book App)లో నమోదు చేయాలంటూ వైఎస్ జగన్(Ys Jagan) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బుక్‌పై అసెంబ్లీ(Assembly)లో సెటైర్లు పేలాయి. వైసీపీ ఇచ్చిన ఫోన్ నెంబర్ల టోటల్ కౌంట్ 11 రావడంతో హోంమంత్రి అనిత(Home Minister Anita), స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Speaker Raghuramakrishnam Raju) విమర్శలు చేశారు. ఇది కథా స్క్రిప్ట్ అంటే అంటూ నవ్వుకున్నారు.


ఏపీలో సమస్యలు తెలిపేందుకు తెలంగాణ(Telangana) ఫోన్ నెంబర్, తెలంగాణలో సమస్యలు తెలిపేందుకు ఏపీ నెంబర్లు ఇవ్వడంపైనా సెటైర్లు కురిపించారు. జగన్ ఎప్పుడు చూసినా కర్ణాటకలో ఉంటారని, ఆయన కర్ణాటక వాసి అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలను జగన్ ఏవిధంగా మిస్ గైడ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవాలని సూచించారు. 11 నెంబర్ ఏ రకంగా వెంటాడుతుందో జగన్‌కు ఇప్పుడు తెలుస్తోందని, ఇదీ అసలైన దేవుడి స్క్రిప్ట్ అంటే అని హోంమంత్రి అనిత విమర్శించారు.

Next Story