- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగ్‌పై కుప్పకూలిపోగా.. ఆ తర్వాత?
బస్సులో ఉన్న ప్రయాణికుల భద్రత డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. అలాంటి డ్రైవర్ కు గుండెపోటు వస్తే.. వారి ప్రాణాలకే ప్రమాదం.

దిశ, వెబ్‌డెస్క్: బస్సులో ఉన్న ప్రయాణికుల భద్రత డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. అలాంటి డ్రైవర్ కు గుండెపోటు వస్తే.. వారి ప్రాణాలకే ప్రమాదం. కావలి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు (Super Luxury Bus) డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డులోకి బస్సురాగానే డ్రైవర్ రసూల్ (50)కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన స్టీరింగ్‌పై కుప్పకూలిపోయారు. దాంతో బస్సు రోడ్డు పక్కకు వెళ్లి ఆగగా.. ప్రయాణికులు అప్రమత్తమై రసూల్‌ను సమీప ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అంతలోనే ఆయన మృతి చెందారు.
గుండెపోటు (Heart Attack)కు గురైన సమయానికి బ్రేక్ వేయడంతోనే ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. డ్రైవర్ మరణంతో బస్సును రాయచోటి ఆర్టీసీ డిపోకు తరలించారు. రసూల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






