- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డుపై షాకింగ్ ఇన్సిడెంట్.. ఆర్టీసీ ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల(Dwaraka Tirumala)లో ఆర్టీసీ బస్సు(Rtc Bus)కు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సుకు బ్రేకులు ఫెయిల్(Breaks Fail) అయ్యాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద బస్సు అదుపు తప్పింది. వేగంగా స్థానికంగా ఉన్న లాడ్జిలోకి దూసుకెళ్లింది. స్తంభాన్ని ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలు కాగా బస్సు ముందు భాగం, అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






