- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ బస్సు (RTC Bus) చెరువులోకి దూసుకెళ్లిన ఘటన బాపట్ల జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ప్రయాణికులను ఎక్కించుకున్న ఆర్టీసీ పల్లె వెలుగు (Palle Velugu) బస్సు చీరాల నుంచి రేపల్లెకు (Chirala to Repalle) వెళ్తోంది. ఈ క్రమంలో నగరం మండలం పరిధిలోని చిరకాలవారిపాలెం గ్రామశివారుకు చేరుకోగానే ప్రమాదానికి (Accident) గురైంది. గ్రామశివారులోని మలుపు తీసుకుంటుండగా బస్సు అదుపు తప్పింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో అది నేరుగా సమీపంలోని చెరువులోకి (Into The Lake) వెళ్లింది. అయితే అతి కష్టం మీద బస్సు మరీ లోపలికి వెళ్లకుండా డ్రైవర్ బస్సును ఆపగలిగాడు. ఈ హఠాత్పరిణామంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు పలువురు వెంటనే అక్కడకు చేరుకున్నారు. బస్సులో ఉన్నవారిని బయటకు దింపేందుకు సహాయం చేశారు. బస్సు ముందు భాగం మునిగిపోవడంతో డ్రైవర్ వెనుక వైపు ఉన్న ఎమర్జెన్సీ డోరును తెరిచాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు గ్రామస్తుల సహకారంతో చెరువులో నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో సుమారు 30 మంది ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. ఎవరీకి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






