టంకీ పనుల వల్లే ఆర్టీసీ బస్సు దగ్ధం.. విచారణకు మంత్రి ఆదేశం

by Vemula.Srinu Prasad |

కడప జిల్లాలో టంకీ పద్ధతిలో జరుగుతున్న పనుల వల్లే బస్సు దగ్ధమైనట్లు అధికారులు తేల్చారు. వేంపల్లి వీరన్నగట్టుపల్లిలో విద్యుత్ వైర్లు తగిలి పూర్తిగా ఆర్టీసీ బస్సుదగ్ధమైన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీయడంతో అధికారులు వివరాలు తెలిపారు..

టంకీ పనుల వల్లే ఆర్టీసీ బస్సు దగ్ధం.. విచారణకు మంత్రి ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District)లో టంకీ పద్ధతిలో జరుగుతున్న పనుల వల్లే బస్సు దగ్ధమైనట్లు అధికారులు తేల్చారు. వేంపల్లి వీరన్నగట్టుపల్లిలో విద్యుత్ వైర్లు తగిలి పూర్తిగా ఆర్టీసీ బస్సు(RTC Bus) దగ్ధమైన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravikumar) ఆరా తీయడంతో అధికారులు వివరాలు తెలిపారు. దీంతో ఘటనపై విచారణకు ఆదేశించారు. అలాగే టంకీ పనుల(Tanky Works)పైనా శాఖాపరమైన పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే రోడ్ల పనులు జరుగుతున్నప్పుడు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. సమగ్ర విచారణ జరిపి ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి గొట్టిపాటా ఆదేశించారు.

ఇదే ఘటనపై...

మరోవైపు ఇదే ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం స్పందించారు. అధికారులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. మంత్రి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో అప్రమత్తతతో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్‌ను మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అభినందించారు.

Next Story