- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
by Kema Shiva Kumar |
లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ఇద్దరు మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ఇద్దరు మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసంగా కాగా బస్సు డ్రైవర్ వినోద్ (45) స్పాట్‌లోనే దుర్మరణం చెందాడు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు వారందరిని తొలుత కావలి ఏరియా ఆస్పత్రికి తరలించి, అక్కడి నంచి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తీసుకెళ్లారు. క్షతగాత్రుల్లో సీతమ్మ (65) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, టీఎస్ ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
Next Story






