Breaking: మాజీ సీఎం జగన్ కారు తనిఖీ

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కారును ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు...

Breaking: మాజీ సీఎం జగన్ కారు తనిఖీ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) కారును ఆర్టీఏ అధికారులు(RTA officials) తనిఖీ చేశారు. జగన్ పర్యటనలో ఈ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం తర్వాత ఈ కారును సీజ్ చేసి గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కారు నడిపిన డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సంచలన పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా కార్యాలయంలో ఉన్న జగన్ కారును ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్‌(MVI Gangadhara Prasad) ఆధ్వర్యంలో ఏపీ 40 డీహెచ్‌ 2349 కారు ఫిట్‌నెస్‌ను పరిశీలించారు.

Next Story