- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh: మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు, ఐదెకరాల భూమి.. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించిన లోకేశ్
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో జవాన్ మురళీనాయక్భౌతిక కాయాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో జవాన్ మురళీనాయక్భౌతిక కాయాన్ని మంత్రి నారాలోకేశ్సందర్శించారు. అగ్నివీర్ మురళీ నాయక్ (Murali Naik) పార్ధీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం అమరజవాను మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరజవాన్ మురళీ నాయక్చిన్నప్పటి నుంచి దేశభక్తి కలిగి ఉండేవాడని తెలిపాడు. కుటుంబానికి ఆధారమైన ఏకైక వ్యక్తి అన్నారు. అతని కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలబడతాయన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు .. ఆ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు, ఐదెకరాల భూమిని అందజేస్తామని ప్రకటించారు. ఇంటికోసం 300 గజాలు అందజేస్తామన్నారు. కుటుంబంలో పెద్ద అయిన తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు. మురళీ నాయక్మెమోరియల్కూడా నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం కూడా నిర్మిస్తామని ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.






