AP News : రూ. 5 కోట్ల విలువైన బంగారం చోరీ.. వారం గడుస్తున్నా దొరకని దొంగ ఆచూకీ

by Muthe.Rajitha |

వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad - Vijayawada)కు బంగారు నగలు డెలివరీ చేసేందుకు వెళ్ళిన కారు డ్రైవర్ నగలతో ఉడాయించిన ఘటనలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

AP News : రూ. 5 కోట్ల విలువైన బంగారం చోరీ.. వారం గడుస్తున్నా దొరకని దొంగ ఆచూకీ
X

దిశ, వెబ్ డెస్క్ : వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad - Vijayawada)కు బంగారు నగలు డెలివరీ చేసేందుకు వెళ్ళిన కారు డ్రైవర్ నగలతో ఉడాయించిన ఘటనలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. రూ.5 కోట్ల విలువైన 6 కేజీల బంగారంతో పారిపోయిన దొంగ ఆచూకీ ఇంకా దొరకక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చోరీ జరిగి వారం గడుస్తున్నా పోలీసులు ఎటువంటి పురోగతి సాధించక పోవడంపై బంగారం షాపు యజమాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగలతో ఎస్కేప్ అయిన డ్రైవర్ కోసం ఆరు ప్రత్యేక బృందాలతో గాలించినా ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా డ్రైవర్ ను పట్టుకునే ప్రయత్నంలో పూర్తిగా పోలీసులు విఫలమవడంపై తీవ్ర చర్చ జరిగుతోంది.

Next Story