Good News:‘ఎకరాకు రూ.31,000’.. మంత్రి కీలక ప్రకటన

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-02 13:16:35  IST  )

గత ప్రభుత్వం పై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు గుప్పించారు.

Good News:‘ఎకరాకు రూ.31,000’.. మంత్రి కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: గత ప్రభుత్వం పై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు గుప్పించారు. పలువురు వైసీపీ నేతలు(YCP Leaders) అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు? అన్నారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati ravi kumar) తేల్చి చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రిలయన్స్ సీబీజీ ప్లాంట్లతో ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అవకాశాలు వస్తాయన్నారు.

గుజరాత్ తర్వాత అత్యధిక ప్లాంట్లు ఏపీ(Andhra Pradesh)లోనే రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. సీబీజీ ప్లాంట్ ద్వారా బంజరు భూములు వినియోగంలోకి రానున్నాయి. ప్రభుత్వ భూములకు ఎకరాకు రూ. 15 వేలు, ప్రైవేట్ భూములకు ఎకరాకు రూ.31 వేలు కౌలు చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలోని సోలార్ పెట్టుబడిదారులను గత ప్రభుత్వం తరిమి కొట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులను ఆహ్వానిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

కందుకూరు నియోజకవర్గంలో ఇండోసోల్ ప్లాంట్‌తో పాటు బీపీసీఎల్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. అతి త్వరలోనే డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని బాటలు వేసే నాయకుడే సీఎం చంద్రబాబు అని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారు.. జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క అవకాశంతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి పేర్కొన్నారు.

Next Story