- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గంజాయి బ్యాచ్‌కు వైఎస్ జగన్ అండదండలా?’.. RRR సంచలన వ్యాఖ్యలు
ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(మంగళవారం) అమరావతి(Amarawati)లో రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju) పర్యటించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెనాలిలో గంజాయి బ్యాచ్‌ను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్(YS jagan) రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.
రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు అనే సామెత జగన్ లాంటి వారిని చూసే వచ్చినట్లుందని ఆయన విమర్శించారు. పోలీసులపై హత్యాయత్నం చేసిన గంజాయి బ్యాచ్‌కు జగన్ అండదండలా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గంజాయి బ్యాచ్‌కు వైఎస్ జగన్ సానుభూతి పలకడం బాధాకరం అన్నారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు సునీల్ కుమార్‌తో నన్ను కస్టడీలో కొట్టించింది జగనే అని రఘురామ తెలిపారు. అరాచకాలు చేసినవారికి జగన్ మద్దతివ్వడం దారుణమని చెప్పారు. ఈ క్రమంలో డాక్టర్ సుధాకర్‌ను వైఎస్ జగన్ ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు. రేపు వైసీపీ వెన్నుపోటు దినోత్సవం‘ తనకు ఓటేయని ప్రజలపై’ చేస్తోందని రఘురామ కృష్ణం రాజు ధ్వజమెత్తారు.






