మరోసారి హాట్ టాపిక్‌గా RRR.. త్వరలోనే ‘తెలుగు వీర లేవరా’ పేరుతో ఫోరమ్‌..!

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నాయకుడు రఘురామ కృష్ణరాజు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. స్వతంత్ర రాజకీయ వేదికను బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ..

మరోసారి హాట్ టాపిక్‌గా RRR.. త్వరలోనే ‘తెలుగు వీర లేవరా’ పేరుతో ఫోరమ్‌..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నాయకుడు రఘురామ కృష్ణరాజు (RRR) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. స్వతంత్ర రాజకీయ వేదికను బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ‘ఇండిపెండెంట్ డెమొక్రటిక్ పార్టీ’ (IDP) పేరును రిజిస్టర్ చేసినట్లు సమాచారం అందుతోంది. పార్టీ ఏర్పాటుతో పాటు సమాజంలో మార్పు కోసం త్వరలోనే ‘తెలుగు వీర లేవరా’ (TVL) పేరుతో ఒక ప్రత్యేక ఫోరమ్‌ను కూడా ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కొత్త పార్టీ, ఫోరం ఏర్పాటు వెనుక ఉన్న అసలు వ్యూహాలు, తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏంటనే విషయాలు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ తాజా పరిణామాలు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి.

Next Story