జైలులో ఉంటూనే నేరాలు.. ఘోరాలు..: శ్రీకాంత్‌‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-23 10:39:25  IST  )

రౌడీ షీటర్

జైలులో ఉంటూనే నేరాలు.. ఘోరాలు..: శ్రీకాంత్‌‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: వ్యక్తి హత్య కేసులో నెల్లూరు జిల్లా జైలు(Nellore District Jail)లో జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్(Rowdy sheeter Srikanth parole) వ్యహారంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రేయసి అరుణతో కలిసి ఆయన నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో దందాలు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అసలు ఈ దందాలన్నీ జైలు నుంచి నడిపినట్లు తెలిసింది.

దీంతో శ్రీకాంత్‌ను నెల్లూరు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. శ్రీకాంత్‌తో సంబంధాలున్న రౌడీ వివరాలు కూడా రాబడుతున్నారు. ఇందుకోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్యా శ్రీకాంత్‌కు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అరుణతో కలిసి చేసిన దందాలు, సెటిల్మెంట్లపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. అలాగే శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో సహకరించిన వారిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Next Story