- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో రౌడీ షీటర్‌తో రాసలీలలు..ప్రియురాలు అరుణ అరెస్ట్
ఏపీలో పెరోల్ పై వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆస్పత్రిలో రాసలీలలు జరిపిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పెరోల్ పై వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆస్పత్రిలో రాసలీలలు జరిపిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ రౌడీ షీటర్‌కు ఇంత స్వేచ్ఛ ఉంటే న్యాయవ్యవస్థ.. రక్షణ వ్యవస్థ పనితీరు ఎలాంటి పరిస్థితిలో ఉంది? అన్న ప్రశ్న మొదలైంది. దీంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని చర్యలకు సిద్ధమైంది. రౌడీ షీటర్ ప్రియురాలు, లేడీ డాన్ అరుణను అద్దంకి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పారిపోతుండగా టోల్ ప్లాజా వద్ద ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అరెస్ట్ కు ముందు అరుణ సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులపై ఆరోపణలు చేశారు. కారు డిక్కీలో దాక్కుని నన్ను కాపాడండి అంటూ రిక్వెస్ట్ చేశారు. తాను కారులో దాక్కున్నానని, పోలీసులు తన కారులో గంజాయి పెట్టాలని మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు.
తాను ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. చంపడానికి చూస్తున్నారని, మీడియానే కాపాడాలని వేడుకున్నారు. ఇదిలా ఉంటే అరుణకు గతంలో వివాహం జరగ్గా భర్త మరణించారు. అనంతరం తాను శ్రీకాంత్ తో ప్రేమలో పడ్డానని అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు అరుణ మీడియాకు వెల్లడించారు. శ్రీకాంత్ హత్య కేసులో అరెస్ట్ అయ్యి జీవితఖైదు అనుభవిస్తున్నా అతడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడినట్టు తెలిపారు. మరోవైపు అరుణకు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉన్నట్టు వార్తలు ఆరోపణలు వస్తున్నాయి. ఓ అడిషనల్ ఎస్పీతో ఆమెకు ఉన్న సంబంధం కారణంగానే ప్రియుడికి పెరోల్ ఇప్పటించగలిగింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎస్పీతో ఆమె మాట్లాడిన ఆడియో, ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి.






