విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య

by Naga Rani Yarlagadda |

విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్యకు (Vizag Rowdy Sheeter Murder) గురయ్యాడు.

విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్యకు (Vizag Rowdy Sheeter Murder) గురయ్యాడు. మాధవధార కుంచుమాంబ అమ్మవారి పండుగలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన వాగ్వాదం.. పరస్పరం కత్తులతో దాడికి దారితీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోగా.. మాసపు లోహిత్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి నేరచరిత్ర ఉందని, స్థానికంగా రౌడీషీటర్ గా పేరు తెచ్చుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లోహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.

Next Story