బినామీలకు దోచిపెట్టే పనిలో ఉన్నారు.. చంద్రబాబుపై రోజా సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు త‌న బినామీల‌కు దోచిపెట్టే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని స్పష్టంగా అర్థమ‌వుతోందని మాజీ మంత్రి రోజా అన్నారు...

బినామీలకు దోచిపెట్టే పనిలో ఉన్నారు.. చంద్రబాబుపై రోజా సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) త‌న బినామీ(Benami)ల‌కు దోచిపెట్టే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని స్పష్టంగా అర్థమ‌వుతోందని మాజీ మంత్రి రోజా(Former Minister Roja) అన్నారు. అమరావతి(Amaravati)లో ఫ్లైఓవ‌ర్ల(Flyovers) నిర్మాణంలో కూటమి ప్రభుత్వం దోచుకుంటోందని వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు ఆమె మద్దతిచ్చారు. ఈ మేరకు మంగళగిరి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రోజా మాట్లాడుతూ నేష‌న‌ల్ హైవే(National Highway) నిర్మాణానికి కిలోమీట‌ర్‌కు రూ.24 కోట్లు అయితే అమ‌రావ‌తిలో మాత్రం కిలోమీట‌ర్‌కు రూ.53 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌కు వైసీపీ హ‌యాంలో కిలోమీటర్‌కు రూ.69 కోట్లు ఖ‌ర్చు అయితే అదే అమరావతి ఫ్లైఓవ‌ర్లకు రూ.189 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారని ఆరోపించారు. మ‌రి దీనిని ఏమంటారు చంద్రబాబు అంటూ రోజా ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.

మాజీ మంత్రి రోజా ట్వీట్..

Next Story