గాలి భాను ప్రకాష్‌ వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన రోజా

by Ajay Maddhiboyina |

న‌గ‌రిలో టీడీపీ ఎమ్మెల్యే భాను ప్ర‌కాష్, వైసీపీ మాజీ మంత్రి రోజా మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యే భాను ప్ర‌కాష్ రోజాపై అస‌భ్య‌క‌రంగా కామెంట్లు చేశారు.

గాలి భాను ప్రకాష్‌ వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన రోజా
X

దిశ, వెబ్ డెస్క్: న‌గ‌రిలో టీడీపీ ఎమ్మెల్యే భాను ప్ర‌కాష్, వైసీపీ మాజీ మంత్రి రోజా మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యే భాను ప్ర‌కాష్ రోజాపై అస‌భ్య‌క‌రంగా కామెంట్లు చేశారు. రోజా వ్యాంప్ కు ఎక్కువ హీర‌యిన్ కు త‌క్కువ అంటూ మాట్లాడారు. ఆమె రూ.2వేలు ఇస్తే ఏ పని అయినా చేస్తుంది. ఇప్పుడు రెండు వేల కోట్లు సంపాదించింది అంటూ భాను ప్ర‌కాష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో భాను ప్ర‌కాష్ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లు, రోజా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. భాను ప్ర‌కాష్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తాజాగా ఆమె మ‌హిళా కమిష‌న్ ను ఆశ్ర‌యించారు. మ‌హిళ‌ల వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ్డ భాను ప్ర‌కాష్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. మ‌రోవైపు ఇప్ప‌టికే రోజా భాను ప్ర‌కాష్ పై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే భాను ప్ర‌కాష్ త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకుంటూ గ‌తంలో రోజా నారాలోకేష్, సీఎం చంద్ర‌బాబుపై చేసిన కామెంట్ల‌కు సంబంధించిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదేనా మీ సంస్కారం అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

Next Story