- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై చీటింగ్ కేసు పెట్టాలి: రోజా
చంద్రబాబు పవన్ కల్యాణ్‌లపై చీటింగ్ కేసు పెట్టాలంటే మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే మేనిఫెస్టోను డస్ట్ బిన్‌లో పెట్టేసి దాని గురించి పట్టించుకోవడం మానేశారని అన్నారు

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు పవన్ కల్యాణ్‌లపై చీటింగ్ కేసు పెట్టాలంటే మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే మేనిఫెస్టోను డస్ట్ బిన్‌లో పెట్టేసి దాని గురించి పట్టించుకోవడం మానేశారని అన్నారు. కానీ అన్ని చేసేసామని చేయలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్లకు నాలుక మందం అని చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అందుకే వాళ్ల మేనిఫెస్టోను గుర్తుచేస్తూ బాబు షూరిటి మోసం గ్యారెంటీతో గడపగడపకు వెళుతున్నామని చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టాలని, అమలు చేయడం కష్టమని బీజేపీ వాళ్లు దూరం ఉన్నారని ఆరోపించారు.
సంతకం చేసి మోసం చేస్తే చీటర్ అంటారని, వీళ్లిద్దరిపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. కాబట్టి ఇద్దరిపై 420 కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులను, మహిళలను ఆకరికి చిన్న పిల్లలను కూడా మోసం చేశారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌నే అమ్మేయాలని మంత్రి అచ్చంనాయుడు అంటున్నారని, మరి ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు, అచ్చెన్నాయుడుకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే దొంగ మేనిఫెస్టో ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






