- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనవరి నెలాఖరుకు రోడ్ల నిర్మాణాలు పూర్తి : మంత్రి జనార్దన్ రెడ్డి
ఏపీలో వచ్చే జనవరి చివరి వరకు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని రోడ్లు-భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో వచ్చే జనవరి చివరి వరకు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని రోడ్లు-భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేసారు. గుంతలు లేని రోడ్లు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.861 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 22,299 కి.మీ. రోడ్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టమన్నారు. అందులో 19,672 కి.మీ. రోడ్లను గుంతలు లేకుండా చేసేందుకు 3,516 ప్రాజెక్టులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే 1,991 కి.మీ. రోడ్ల పనులు పూర్తయ్యాయని, మిగతావన్నీ సంక్రాంతి నాటికి లేదా జనవరి నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
అలాగే సైక్లోన్ మోంతా కారణంగా దెబ్బతిన్న 4,794 కి.మీ. రోడ్లు, 311 కల్వర్టులు, బ్రిడ్జిల మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తుఫాను వలన సుమారు రూ.3,432 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేసి కేంద్రం నుంచి రూ.900 కోట్ల సహాయం కోరుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర హైవేల్లో 10,200 కి.మీ. రోడ్లను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు. టోల్ రేట్లు ప్రజలకు భారం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.






