- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరం.. హాస్టల్ టాయిలెట్‌లో ఆర్‌ఓ వాటర్ ఫ్యూరిఫయర్.. విద్యార్థులు తాగింది ఏ నీరంటే..?
ప్రభుత్వ హాస్టల్‌లో ఘోర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, ఇంకొల్లు : ప్రభుత్వ హాస్టల్‌లో ఘోర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వదులుకోవద్దని సదుద్దేశ్యం ఓవైపు కనిపిస్తుండగా.. మరోవైపు టాయ్‌లెట్‌లో మంచి నీటి పథకాన్ని ప్రారంభించడం విస్మయానికి గురి చేసింది. ఈ ఘటనతో హాస్టల్ వార్డన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ ఏం జరిగిందంటే..?
ఇంకొల్లులోని సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహాని(Inkollu Social Welfare Boys' Hostel)కి ప్రభుత్వం ఆర్.ఓ ఫ్యూరిఫయర్(RO water purifier filter)ను మంజూరు చేసింది. విద్యార్థులు స్వచ్ఛమైన మంచినీటిని అందించాలన్న ఉద్దేశ్యంతో ఆర్.ఓ ఫ్యూరిఫయర్‌ను సర్కార్ అందించింది. అయితే ఆర్.ఓ ఫ్యూరిఫయర్‌ను వినియోగించడానికి హాస్టల్‌లో వార్డన్ అనాలోచితంగా ఆలోచించాడు. ఆర్.ఓ ఫ్యూరిఫయర్‌ను హాస్టల్ మరుగుదొడ్డి(Toilet)లో బిగించారు. విద్యార్థులకు మాత్రం మంచి నీటిని బయట నుండి తీసుకువచ్చి అందిస్తున్నారు. కానీ హాస్టల్‌కు మంజూరైన ఆర్.ఓ ఫ్యూరిఫయర్‌ను మాత్రం వినియోగంలోకి తీసుకురాలేదు. తాజాగా మరుగుదొడ్డిలో ఆర్.ఓ ఫ్యూరిఫయర్‌ను బిగించిన ఫొటోలు బయటకు పొక్కటంతో విషయం బయటపడింది. ఇది కాస్తా వైరల్ కావడం.. వార్డన్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో మరుగుదొడ్డిలో ఉన్న ఆర్.ఓ ఫ్యూరిఫయర్‌ను తొలగించాడు.






