- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: రోడ్లపై ప్రమాదకర స్టంట్లు.. పట్టించుకోని పోలీసులు
వైఎస్సార్ జిల్లా రాయచోటిలో అల్లరి మూకలు రోడ్డుపై రెచ్చిపోయారు...

దిశ, వెబ్ డెస్క్: బైక్‌పై స్టంట్లు ప్రమాదకరం, రోడ్లపై చట్ట విరుద్ధం అని చెబుతున్నా కొందరు అల్లరి మూకలు పట్టించుకోవడం లేదు. బైక్‌లను స్పీడుగా నడుపుతూ రోడ్డుపై అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. సరైన శిక్షణ, భద్రతా చర్యలు లేకపోవడంతో జీవితాలను చిన్నవయసులోనే చిదిమేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లకోసం స్టంట్లు చేసి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఎక్కువ అయ్యాయి. హైదరాబాద్, విశాఖ, వరంగల్, తిరుపతి లాంటి పెద్ద సిటీల్లో కాకుండా ఇప్పుడు సాధారణ నగరాల్లోనూ బైక్స్ స్టంట్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
తాజాగా వైఎస్సార్ జిల్లా రాయచోటి(YSR District Rayachoti)లో అల్లరి మూకలు(Riots) రోడ్డుపై రెచ్చిపోయారు.ప్రధాన రహదారిపై బైక్(Byke)తో అతి ప్రదర్శించారు. ప్రమాదకర సాహసం చేశారు. సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దంతో రింగ్ రోడ్డుపై ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. బైక్ ఒక చక్రంతో వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదకర స్టంట్స్(Dangerous Stunts) చేశారు. దీంతో తోటి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ తమకు ప్రమాదం చేస్తారేమోనని ఆందోళన చెందారు. అల్లరి మూకలు బైక్ నడుపుతున్న దృశ్యాలను ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన కొందరు.. రాయచోటిలో ఇంత జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. వెంటనే అల్లరి మూకలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వాలని కామెంట్లు పెట్టారు. తల్లిదండ్రుల సమక్షంలో సరైన జాగ్రత్తలు చెప్పాలని, అప్పుడే అల్లరిమూక మరోసారి రోడ్లపైకి రాకుండా ఉంటుందని అంటున్నారు. మరి పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.






