వామ్మో..! ఆర్జీవి లోకేష్ ని ఇంత మాట అనేశారేంటో..!

by Disha Web Desk 3 |
వామ్మో..! ఆర్జీవి లోకేష్ ని ఇంత మాట అనేశారేంటో..!
X

దిశ డైనమిక్ బ్యూరో: క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ దేశంలో స్వాతంత్రాన్ని పూర్తిగా వినియోగించుకునే ఏకైక వ్యక్తి ఆర్జీవీ అని ప్రజల అభిప్రాయం. వివాదాస్పదంగా మాట్లాడడంలో ఆయనకి ఆయనే సాటి అని ప్రజల అభిప్రాయం. నేను ఏది అలోచించి మాటలను, మాట్లాడిన తరువాత కూడా ఆలోచించను అనేలా ఈయన వ్యకిత్వం ఉంటుంది.

ఇన్నాళ్లు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈయన ఇప్పుడు వైసీపీకి మద్దతుగా నిలుస్తూ టీడీపీతో ఆడుకుంటున్నారు. అవకాశం ఉంటె కాదు.. అవకాశాన్ని సృష్టించుకుని మరి కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ లో టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ కనుక ఆ ఉద్దేశంతో ఇలా రాసుకొచ్చారు.. సీనియర్ ఎన్టీఆర్ వ్యవస్థాపకులు సహజంగా ఆయన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంతే కానీ ఈ కుత్రిమ లోకేష్ కాదు అని పోస్ట్ లో రాసుకొచ్చారు. కాగా ఈ పోస్ట్ పైన స్పందించిన జనసేన అభిమాని ఆర్జీవీ కౌంటర్ కి ధీటుగా ఘాటైన రీకౌంటర్ ఇచ్చారు. రాజకీయం అంటే వారసత్వం కాదని.. ఇది ఒక వ్యక్తి యొక్క ఆసక్తి, సామర్ధ్యాలు మాత్రమే అని, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అంటూ కామెంట్ చేశారు.



Next Story

Most Viewed