- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైసీపీ కీలక నేతతో ఆర్జీవీ మంతనాలు!

దిశ, డైనమిక్‌బ్యూరో : ప్రకాశం జిల్లా మద్దాపాడు మండలం వెల్లంపల్లిలో ఈ రోజు ఉదయం రాంగోపాల్‌వర్మను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు. ఓ హోటల్లో వీరిద్దరూ మంతనాలు సాగించారు. ఇవాళ్ల ఒంగోలు రూరల్‌పోలీస్‌స్టేషన్‌లో ఆర్జీవీ విచారణకు హాజరుకావలసి ఉంది. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయనకు రెండు సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారని కూడా వదంతులు వినిపించాయి. అదేం లేదంటూ తాను అందుబాటులోనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఆ తర్వాత ఆయన హైకోర్టులో ముందస్తు బెయిలు పొందారు. ఆ సమయంలో కోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఆయన విచారణకు హాజరు కావలసి ఉంది. ఈ రోజు ఆయన ఒంగోలు చేరుకోవాల్సి ఉండగా.. మార్గ మధ్యలో వైసీపీ కీలకనేతతో భేటీ కావడం ఫ్రాధాన్యం సంతరించుకుంది.