మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్.. గెస్ట్‌హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-03 17:11:18  IST  )

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు బిగ్ షాక్ ఇచ్చాయి. .

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్.. గెస్ట్‌హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు.సత్యసాయి జిల్లా గుర్రాల కొండపై ఆయన కట్టుకున్న గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తించారు. అయితే ఈ స్థలం ప్రభుత్వ భూమి కాదని గతంలోనే కోర్టును ఆశ్రయించారు. దీంతో రెవెన్యూ శాఖ పూర్తి సర్వే చేసింది. మొత్తం రెండున్నర ఎకరాల భూమిని కుటుంబసభ్యుల పేరుతో రిజిస్ట్రర్ చేయించినట్లు గుర్తించింది. ఈ మేరకు ఆ భూమని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెళ్లారు. కొండపైకి వెళ్లే మార్గం గేటుకు తాళం వేసి ఉండటంతో వెను దిరిగారు. త్వరలో కేతిరెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గెస్ట్ హౌస్‌ను ఖాళీ చేయాలని, లేదంటే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందుకు కేతిరెడ్డి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Next Story