- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాసెట్ ఎంట్రెన్స్‌కు హాజరైన రిటైర్డ్ ఐపీఎస్.. ఆయన ఎవరో తెలుసా?
ఐపీఎస్‌గా రిటైర్ అయినా.. ఆయన ఎప్పుడూ నిత్య విద్యార్థే.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎస్‌గా రిటైర్ అయినా.. ఆయన ఎప్పుడూ నిత్య విద్యార్థే. వయసుతో సంబంధం లేకుండా ఏదో సాధించాలనే సంకల్పం మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది అనడానికి ఉదాహరణ మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు. అయితే, తాజాగా ఆయన లా చదవాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఒంగోలులోని రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో వెంకటేశ్వర రావు ఇవాళ లాసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ ఇలా పరీక్షకు హాజరవడం పట్ల తోటి అభ్యర్థులతో పాటు అక్కడున్న అధ్యపక బృందం ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కాగా, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావుకు ఇటీవలే ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. ఆయనపై వైసీపీ సర్కార్ హయాంలో నమోదైన అభియోగాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన సస్పెండ్ అయిన కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది.






