రాజకీయాల్లో నోరు పారేసుకోవడం మొదలు పెట్టిందే కేసీఆర్: ఏబీ వెంకటేశ్వరరావు

by Vemula.Srinu Prasad |

రాజకీయాల్లో నోరు పారేసుకోవడం అనేది కేసీఆర్ నుంచే మొదలైందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు..

రాజకీయాల్లో నోరు పారేసుకోవడం మొదలు పెట్టిందే కేసీఆర్: ఏబీ వెంకటేశ్వరరావు
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో నోరు పారేసుకోవడం అనేది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(Former Telangana CM KCR) నుంచే మొదలైందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(Retired IPS officer AB Venkateswara Rao) అన్నారు. కేసీఆర్‌ను గురువుగా భావించి ఆ పరంపరను రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్(YSRCP chief YS Jagan) కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. జగన్ హయాంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు బూతులతో విరుచుకుపడిన ఘటనలను ఉద్దేశించి వెంకటేశ్వరరావు మాట్లాడారు. స్వంతంత్ర భారతంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చని, కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ వారిని కేసీఆర్ నోటికొచ్చిన బూతులు తిట్టారన్నారు. అప్పటి పరిస్థితిని బట్టి ఆయనకు ధీటుగా మాట్లాడిన వారు ఎవరూ లేరని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎదుటి వారిని తొక్కుకుంటూ వెళితే గాని రాజకీయాలు చేయలేమనే మూడ్‌లో అప్పట్లో కేసీఆర్, ఆ తర్వాత జగన్ ప్రయాణం చేశారని చెప్పారు. ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్లు బూతులు మాట్లాడటం సరికాదని ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు.

Next Story