రిటైర్డ్ ఐఏఎస్ పశ్చాత్తాపం.. ఏబీ వెంకటేశ్వరరావుకు బహిరంగ క్షమాపణలు (VIDEO)

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-12 08:38:34  IST  )

ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను కొందరు వ్యక్తులపై వ్యవహరించిన తీరుపట్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

రిటైర్డ్ ఐఏఎస్ పశ్చాత్తాపం.. ఏబీ వెంకటేశ్వరరావుకు బహిరంగ క్షమాపణలు (VIDEO)
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను కొందరు వ్యక్తులపై వ్యవహరించిన తీరుపట్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ కు బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. సర్వీసులో ఉండగా వారిపట్ల తాను అనుచితంగా ప్రవర్తించానని, అందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. గతేడాది తనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగిందని, ఆ తర్వాత తాను చేసిన దానిగురించి ఆలోచిస్తే తప్పనిపించిందని పేర్కొన్నారు. 30 ఏళ్ల సర్వీసులో తానెప్పుడూ అవినీతికి పాల్పడలేదన్నారు.

Next Story