అమరావతి చట్టబద్ధతపై మరింత దూకుడు.. అసెంబ్లీ వేదికగా రేపు తీర్మానం

by Vemula.Srinu Prasad |

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై ప్రభుత్వం మరింత దూకుడు పెంచింది. అసెంబ్లీ సాక్షిగా ఈ తీర్మాన్ని పాస్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది...

అమరావతి చట్టబద్ధతపై మరింత దూకుడు.. అసెంబ్లీ వేదికగా రేపు తీర్మానం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati) చట్టబద్ధతపై ప్రభుత్వం మరింత దూకుడు పెంచింది. అసెంబ్లీ సాక్షిగా ఈ తీర్మాన్ని పాస్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సభలో అమరావతి రాజధాని(Capital) చట్టబద్ధత ఆవశ్యకతను వివరించి సభ్యుల నుంచి ఆమోదం పొందేలా ప్రభుత్వం వ్యూహ రచనలు చేసింది. మొత్తం నాలుగు గంటల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చర్చించి సభ్యులు ఆమోదించనున్నారు. అనంతరం ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. ఈ తీర్మానం సమన్వయబాధ్యతలను మంత్రులు లోకేష్‌, పయ్యావుల, నాదెండ్లకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) అప్పగించారు. ఈ మేరకు శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నా అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు సర్వంసిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామం చోటు చేసుకుందో చూడాలి.

Next Story