- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతుగా రాజీనామాలు
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో మెుదలైన రాజీనామాల పరంపర కొనసాగుతుంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో తాడేపల్లికి చెందిన పలువురు వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వైసీపీ పార్టీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి రాజీనామా చేశారు. అలాగే తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు మున్నంగి వివేకానంద రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. జేసీఎస్ కన్వీనర్ ఈదులముడి డేవిడ్ రాజ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి, మంగళగిరి రూరల్ మండలం జేసీఎస్ కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మర్గన రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేశారు. అంతేకాదు వైసీపీలో కొనసాగడం లేదు అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.






