- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందుబాబా మజాకా.. ధరలు తగ్గించాలని మంత్రి సోదరుడి విగ్రహానికి వినతి
మందుబాబుల చేష్టలు గమ్మత్తుగా ఉంటాయి. తలకెక్కేదాక తాగిన తరవాత కొంతమంది తిక్కతిక్కగా ప్రవర్తిస్తుంటారు. ఏం చేస్తున్నామనే సోయి లేకుండా ప్రవర్తిస్తారు.

దిశ, వెబ్ డెస్క్: మందుబాబుల చేష్టలు గమ్మత్తుగా ఉంటాయి. తలకెక్కేదాక తాగిన తరవాత కొంతమంది తిక్కతిక్కగా ప్రవర్తిస్తుంటారు. ఏం చేస్తున్నామనే సోయి లేకుండా ప్రవర్తిస్తారు. అయితే అలా చేస్తే ఒకప్పుడు స్పాట్ లో ఉన్నవాళ్లు మాత్రమే నవ్వేవాళ్లు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ప్రపంచమంతా నవ్వేస్తుంది. ఏం చేసినా జనాలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఓ మందుబాబు ఫుల్లుగా మద్యం తాగి విగ్రహానికి తన వినతి తెలియజేశాడు.
ఈ ఘటన టెక్కలిలో చోటు చేసుకుంది. టెక్కలిలో ఫుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రం నాయుడు విగ్రహం వద్దకు వెళ్లి మద్యం ధరలు తగ్గించాలని విన్నవించుకున్నాడు. అది కూడా పాట పాడుతూ కోరడంతో అక్కడే ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు సైతం నవ్వుతున్నారు. మందుబాబా మజాకా అంటూ కామెంట్ చేస్తున్నారు.






