Breaking:సింహాచలం ఘటనపై ప్రభుత్వానికి చేరిన నివేదిక.. వారిపై చర్యలకు ఆదేశం

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-05 12:35:35  IST  )

విశాఖ(Vishakapatnam)లోని సింహాచలం అప్పన్న ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

Breaking:సింహాచలం ఘటనపై ప్రభుత్వానికి  చేరిన  నివేదిక.. వారిపై చర్యలకు ఆదేశం
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ(Vishakapatnam)లోని సింహాచలం అప్పన్న ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆలయంలో జరిగిన ఈ విషాద ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. గత మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో సింహాచలం ఆలయంలోని గోడ కూలడంతో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వం(AP Government) విచారణకు ఆదేశిస్తూ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో సింహాచలం(Simhachalam)లో గోడ కూలి ఏడుగురు భక్తులు(Devotees) మృతి చెందిన ఘటన పై త్రిసభ్య కమిటీ విచారణ నేటితో(సోమవారం) ముగిసింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో హోం మంత్రి అనిత(Home Minister Anitha), దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డి(Minister Anam ramanarayana Reddy) సమావేశమయ్యారు. ఈ క్రమంలో త్రి సభ్య కమిటీ అందించిన నివేదికపై చర్చించారు.

తాత్కాలికంగా కట్టిన గోడకు పునాది లేకపోవడంతో భారీ వర్షం రావడంతో పెద్ద ఎత్తున నీరు, బురద చేరి గోడ కూలిందని తెలిపారు. సింహచలం అప్పన్న స్వామి చందనోత్సవానికి వారం ముందు హడావిడిగా ఈ గోడ నిర్మించారు. ప్రసాద్ పథకంలో భాగంగా గోడకు అనుమతి ఇచ్చారు. కానీ డిజైన్, పునాది లేకుండానే గోడ కట్టేశారు. విశాఖ సీపీ, సాక్షుల నుంచి తీసుకున్న వాంగ్ములం ప్రకారం.. ఆలయ ఈవో, ఇంజినీరింగ్ సిబ్బంది, పర్యాటక శాఖ అధికారులు గుత్తేదారులే బాధ్యులు అని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ తరుణంలో నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Next Story