నకిలీ మద్యం తయారీ కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-12 09:14:44  IST  )

కొనసాగుతున్న నిందితుల విచారణ. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సంచలనం సృష్టించిన నకిలీ మద్యం (Fake Liquor) తయారీ, విక్రయాల కేసులో నిందితులకు చుక్కెదురైంది

నకిలీ మద్యం తయారీ కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సంచలనం సృష్టించిన నకిలీ మద్యం (Fake Liquor) తయారీ, విక్రయాల కేసులో నిందితులకు చుక్కెదురైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ సోదరులతో (Jogi Ramesh Brothers) పాటు ఇతర నిందితుల రిమాండ్‌ను విజయవాడ ఎక్సైజ్ కోర్టు (Excise Court) ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది. సోమవారం రిమాండ్ గడువు ముగియడంతో ఎక్సైజ్ అధికారులు జోగి రమేశ్ సోదరులతో పాటు ఇతర నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, విచారణ కొనసాగుతున్న దృష్ట్యా రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జోగి సోదరులు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్నారు.

​అదేవిధంగా ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న బాలాజీ, సుదర్శన్, తలారి రంగయ్యలను నెల్లూరు జిల్లా జైలుకు తరలించినట్లు సమాచారం. నకిలీ మద్యం దందా ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, అద్దేపల్లి బ్రదర్స్‌తో కలిసి జోగి సోదరులు ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహించారని ఎక్సైజ్ శాఖ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే సిట్ (SIT) అధికారులు కీలక ఆధారాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నారు. ఈ క్రమంలో నిందితుల బెయిల్ పిటిషన్లను గతంలోనే కోర్టు తిరస్కరించడం గమనార్హం.

Next Story