- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మంత్రి చొరవతో అయ్యప్ప భక్తులకు ఊరట
ఏపీ మంత్రి చొరవతో అయ్యప్ప భక్తులకు ఊరట లభించింది. శబరిమల వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వేచి చూస్తున్న అయ్యప్ప భక్తులకు మంత్రి సహాయం ఎంతో తోడ్పడింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మంత్రి చొరవతో అయ్యప్ప భక్తులకు ఊరట లభించింది. శబరిమల వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వేచి చూస్తున్న అయ్యప్ప భక్తులకు మంత్రి సహాయం ఎంతో తోడ్పడింది. ఆన్లైన్ లో దర్శనం స్లాట్ బుక్ చేసుకొని వెళ్తున్న అయ్యప్ప భక్తులు మంత్రి చొరవ పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇండిగో విమాన సేవలు రెండు రోజులుగా రద్దవుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయంలో వేచి ఉన్నారు. గంటల పాటు వేచి ఉన్నప్పటికీ వారికి తాము వెళ్లాల్సిన ఫ్లైట్ గురించి ఎటువంటి సమాచారం అందలేదు. అంతేకాకుండా ఆకస్మికంగా ఫ్లైట్ రద్దు చేసినట్లు సదరు విమానయాన సంస్థ ప్రకటించింది. దీంతో అయ్యప్ప భక్తులు నిరాశకు గురయ్యారు. స్వామికి ఇరుముడి సమర్పిద్దామని బయలుదేరిన తమకు ఎంతటి కష్టమొచ్చిందని వారు బాధపడ్డారు. ఈ క్రమంలో విజయవాడ ఫ్లైట్ కోసం శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు ఏపీ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ ఫ్లైట్ కోసం వేచి ఉన్నారు. తన ఫ్లైట్ ఆలస్యం కావడంతో అక్కడే ఉన్నారు.
శబరిమల వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ కాన్సిల్ అవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన చేయడం మంత్రి గమనించారు. విపరీతమైన ఆలస్యం అయితే దర్శనం టోకెన్లు పనికి రావని, దర్శనం చేసుకోలేమని వారు ఆందోళన వ్యక్తం చేయడంతో చలించిపోయారు. అక్కడ ఇండిగో సిబ్బంది స్పందించక పోవడం గమనించారు. స్వయంగా రంగంలోకి దిగి కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఫోన్ లో మాట్లాడారు. అక్కడే దగ్గర ఉండి వారికి ప్రత్యేక సదుపాయం కల్పించి శబరిమల విమానం బయలుదేరి వెళ్ళేదాకా పర్యవేక్షించారు.
తాను స్వయంగా విజయవాడ వెళ్లవలసిన విమానం మిస్ అయినా అక్కడే ఉండి ఆ తరువాత రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ప్రారంభించారు. రాష్ట విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నూజివీడులో ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్ సమావేశానికి బయలు దేరారు. తమ కోసం తెల్లవారుజాము నుంచి శ్రమ పడి ప్రయాణ వసతి కల్పించారని, ఆయన వల్లే సకాలంలో దర్శన భాగ్యం కలిగే అవకాశం పొందామని స్వాములు మంత్రి ధన్యవాదాలను తెలియజేశారు.






