- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్వా రైతులకు ఊరట: రొయ్యల ఫీడ్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
by Vemula.Srinu Prasad |
ఏపీలోని ఆక్వా రైతులకుఊరట లభించింది. రొయ్యల ఫీడ్ ధరలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని ఆక్వా రైతులకు(Aqua Farmers) ఊరట లభించింది. రొయ్యల ఫీడ్ ధరల(Shrimp Feed Prices) పెంపుతో తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం రూ. 4 తగ్గించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రొయ్యల ఫీడ్ ధరలపై మానిటరింగ్
దీంతో రొయ్యల ఫీడ్ ధరలపై ఈ కమిటీ రాష్ట్ర స్థాయి మానిటరింగ్ చేయనుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కమిటీ పని చేయనుంది. రొయ్యల ధర నిర్ణయంతో పారదర్శకతకు కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ ధరలను ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. అలాగే యాప్ ద్వారా రొయ్యల కొనుగోలు ధరల సమాచారాన్ని అందించనున్నారు.
Next Story






